అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీటర్ సాక్షిగా మరోసారి మీడియాపై అక్కసును వెళ్లగక్కారు.
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీటర్ సాక్షిగా మరోసారి మీడియాపై అక్కసును వెళ్లగక్కారు. తనకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేసినందుకు వామపక్ష ఎంఎస్‌ఎన్‌బీసీ కేబుల్ నెట్‌వర్క్‌పై మండిపడ్డారు. ఆ చానెల్‌లో ‘మార్నింగ్ జో’ కార్యక్రమం నిర్వహిస్తున్న ఇద్దరు యాంకర్లు మికా, జో స్కార్బొరోగ్‌లపై వ్యక్తిగత దూషణలకు దిగారు.
‘పిచ్చి మికా, సైకో జోలు చెడ్డవాళ్లు కాదు. కానీ అతితక్కువ రేటింగ్ ఉన్న వాళ్ల షోను చానెల్ యాజమాన్యం చెప్పినట్లే నడిపించాల్సి వస్తోంది. ఇది నిజంగా దురదృష్టకరం’ అని ట్వీట్ చేశారు. తనను విమర్శిస్తున్నందున వీరి కార్యక్రమాన్ని చూడవద్దని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. సీఎన్‌ఎన్ సంస్థ తప్పుడు వార్తలతో చెత్త జర్నలిజానికి పాల్పడుతోందన్నారు.