శాన్‌ఫ్రాన్సిస్కో: సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విటర్ ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్-19 కొత్త భూభాగాల్లో కూడా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించింది. మొత్తం 5 వేల మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయాలని కోరింది. దీనికి సంబంధించి హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా కార్యాలయాలలో పనిచేసే ఉద్యోగులకు మాండేటరీ ఆదేశాలు జారీ చేసింది. అనవసర ప్రయాణాలపై ఇప్పటికే ఆంక్షలు విధించిన మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాం తాజా నిర్ణయం తీసుకుంది.
కోవిడ్-19 విస్తరణకు అడ్డుకట్ట వేసే యోచనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరూ ఇంటి నుంచే పనిచేసేందుకు ప్రోత్సహిస్తున్నామని ట్విటర్ ప్రకటించింది. ప్రభుత్వ ఆంక్షల కారణంగా హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా కార్యాలయాలలో పనిచేసే ఉద్యోగులు ఇంటి నుండి పనిచేయడం తప్పనిసరని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment