సాక్షి,న్యూఢిల్లీ: భారత్‌లో ఓటర్లుగా నమోదైన ప్రవాస భారతీయుల(ఎన్‌ఆర్‌ఐ) సంఖ్య గత మూడేళ్లలో రెట్టింపైనట్టు ఈసీ, ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.విదేశాల్లో నివసించే భారతీయుల సంఖ్యాపరంగా చూస్తే ఈ గణాంకాలు ఇప్పటికీ అతి తక్కువ గమనార్హం. ఓవర్సీస్ ఓటరు ఎన్నికల సమయంలో విధిగా భారత్‌కు రాకుండానే తమ ప్రతినిధి ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజా ప్రాతినిథ్య చట్టంలో మార్పులు చేపడుతున్న క్రమంలో ఎన్‌ఆర్‌ఐలు భారత్‌లో ఓటరుగా నమోదయ్యేందుకు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు.
గతంలో ఓటరుగా నమోదు చేసుకున్న ఎన్‌ఆర్‌ఐలు ఓటు వేయాలంటే విధిగా దేశానికి వచ్చి తమ నియోజకవర్గాల్లో స్వయంగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన పరిస్థితి. ఇది తీవ్ర వ్యయప్రయాసలకు లోనుచేస్తుండటంతో ఎన్‌ఆర్‌ఐలు ఓటింగ్ ప్రక్రియపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. మే, 2012 నాటికి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోటి మందికి పైగా ప్రవాసులుంటే వారిలో కేవలం 11,846 మందే ఓవర్సీస్ ఓటర్లుగా నమోదు చేయించుకున్నారు. 2015 నాటికి వీరి సంఖ్య రెండింతలై 24,348కి చేరిందని పార్లమెంట్‌లో ప్రభుత్వం పేర్కొంది.కాగా వీరిలో 23,556 మంది కేరళకు చెందిన వారే.
Comments
Please login to add a commentAdd a comment