అమెరికాకు చెందిన రోజ్ మేరీ బెంట్లీ అనే మహిళకు ఒక హార్ట్ తప్పమిగిలిన అవయవాలన్నీ రివర్స్‌లోనే..అయినా ఆరోగ్యంగా 99 ఏళ్లు బతికేసింది. ప్రపంచంలో నిజంగా ఒక వైద్య అద్భుతమేనంటూ వైద్యశాస్త్ర నిపుణులు ఆశ‍్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్శిటీ విద్యార్థులు ఈ అద్భుతాన్ని గమనించారు. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ అనాటమిస్ట్స్ వార్షిక సమావేశంలో ప్రెజంటేషన్‌లో భాగంగా ఒరెగాన్ హెల్త్ అండ్ సైన్సు యూనివర్శిటీఈ విషయాన్ని ప్రపంచానికి వెల్లడించింది.
వివరాల్లోకి వెళితే రోజ్ మేరీ బెంట్లీ 99 ఏళ్ల వయసులో 2017 అక్టోబరులో చనిపోయారు. అయితే ఆమె కోరిక మేరకు ఆమె బాడీని యూనివర్శిటీకి పరిశోధనల నిమిత్తం దానం చేశారు కుటుంబ సభ్యులు. ఇదే అద్భుత ఆవిష్కరణకు నాంది పలికింది. ఆమె శరీరంలోని అవయవాలు చూసి యూనివర్శిటీ విద్యార్థులతోపాటు ప్రొఫెసర్లు, నిపుణులు ఒక్కసారిగా షాకయ్యారు ఒక హృదయం తప్ప అన్ని అవయవాలు రివర్స్‌లో ఉన్నాయి. కాలేయం, ప్లీహము, కడుపు, జీర్ణవ్యవస్థ, పెద్దప్రేగు సహా అన్నీ ఆరోహణ స్థితిలో ఉన్నాయి. కుడి ఊపిరితిత్తుల్లో సాధారణంగా ఉండాల్సిన 3 లాబ్స్‌కు బదులుగా రెండు మాత్రమే ఉన్నాయి. అంతేకాదు గుండెలోని కుడి కర్ణిక సాధారణం కంటే రెండు రెట్లు పెద్దదిగా ఉంది. ఈ అరుదైన పరిస్థితిని సిటస్ ఇన్వర్సస్ విత్ లెవోకార్డియా అని పిలుస్తారని అనాటమీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వాకర్ చెప్పారు.
5 కోట్ల మందిలో ఒకరికి మాత్రమే ఇలా జరుగుతుంది. ఇలా పుట్టినవాళ్లు దీర్ఘకాలం బతకడం కూడా కష‍్టమే. ఒక వేళ జీవించినా తరచూ ప్రాణాంతకమైన కార్డియాక్ వ్యాధులు, ఇతర అసాధారణతలతో బాధపడతారట. అయితే బెంట్లీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా దాదాపు వందేళ్లు హాయిగా జీవించారామె. ఆమె కుటుంబానికి గానీ, బెంట్లీకి గానీ ఈ అసాధారణ పరిస్థితి గురించి తెలియదు. అయితే గాల్‌బ్లాడర్ ఆపరేషన్‌తో పాటు 50 ఏళ్ల వయసులో హిస్టరెక్టమీ (గర్భసంచి తొలగింపు) చేయించుకున్నారని బెంట్లీ కుమార్తె తెలిపారు. అయితే అపెండిసైటిస్ ఆపరేషన్ సందర్భంగా మాత్రమే అపెండిసైటిస్ ఉండాల్సిన ప్లేస్‌లో లేదని డాక్టర్లు తెలిపారన్నారు. చనిపోవడానికి రెండు మూడు సంవత్సరాలకు ముందు ఆర్థరైటిస్‌తో బాధపడ్డా రన్నారు. అయిదుగురు పిల్లలకు జన్మనిచ్చిన బెంట్లీ మంచి స్విమ్మర్ కూడా. అంతేకాదు మరణానంతరం శరీరాన్ని దానం చేయాలని నిర్ణయించుకుని పలువురికి స్ఫూర్తిగా నిలిచారు
Comments
Please login to add a commentAdd a comment