
చంద్రుడి పుట్టుక గుట్టు ఇదీ..!
చిన్నచిన్న చంద్రుడి లాంటి సమూహాలు ఢీకొని చంద్రుడు ఏర్పడ్డాడని తాజా అధ్యయనంలో తేలింది.
జెరూసలెం: చిన్నచిన్న చంద్రుడి లాంటి సమూహాలు ఢీకొని చంద్రుడు ఏర్పడ్డాడని తాజా అధ్యయనంలో తేలింది. అలాగే ఇప్పుడు మనం చూస్తున్న చంద్రుడు భూమికి మొదటివాడు కాదని, ఇప్పటివరకు చాలా చంద్రగ్రహాలు మన భూమికి ఉపగ్రహాలుగా ఉన్నాయని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన ఇజ్రాయిల్‌లోని వైజ్‌మన్న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇజ్రాయిల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలకు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. పురాతన భూగ్రహానికి అనేక చంద్రగ్రహాలు ఉపగ్రహాలుగా ఉన్నాయని, అనంతరం ఈ చిన్న చిన్న గ్రహాలే ఢీకొని పెద్ద చంద్రుడు ఉద్భవించేందుకు దోహదపడ్డాయని పరిశోధకుడు హగాయ్ పెరెట్స్ తెలిపారు.