వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడనేందుకు ఆధారాలున్నాయని ఒక రహస్య విజిల్ బ్లోయర్ చేసిన ఫిర్యాదు వెల్లడించింది. వచ్చే సంవత్సరం జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మరో దేశం జోక్యాన్ని ట్రంప్ కోరారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని తొక్కిపట్టేందుకు వైట్‌హౌజ్ ప్రయత్నించిందని గురువారం వెలుగులోకి వచ్చిన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. రానున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీ తరఫున తన ప్రత్యర్థి కానున్న జో బిడెన్, ఆయన కుమారుడు హంటర్ బిడెన్ ఆర్థిక లావాదేవీలపై విచారణ జరపాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వలొదిమిర్ జెలెన్‌స్కీపై డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి తీసుకు వచ్చిన వివరాలను ఆ ఫిర్యాదులో పొందుపర్చారు.
రౌల్ కాస్ట్రోపై అమెరికా ఆంక్షలు
క్యూబా మాజీ అధ్యక్షుడు రౌల్ కాస్ట్రో, ఆయన కుటుంబసభ్యుల విదేశీ ప్రయాణాలపై అమెరికా ఆంక్షలు విధించింది. అధ్యక్ష పదవి నుంచి వైదొలగినప్పటికీ అధికార కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి హోదాలో రౌల్ కాస్ట్రో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆరోపించింది. ఏకపక్షంగా వేలాది మందిని నిర్బంధిస్తున్నారని, ప్రస్తుతం 100 మంది క్యూబన్లు రాజకీయ ఖైదీలుగా ఉన్నారని విమర్శించింది. దివంగత విప్లవ నేత సోదరుడైన రౌల్ కాస్ట్రో(88) ఆంక్షల కారణంగా అమెరికా వెళ్లడం వీలుకాదు. (చదవండి: ట్రంప్‌పై మళ్లీ అభిశంసన)
Comments
Please login to add a commentAdd a comment