వాషింగ్టన్: దాయాది దేశం పాకిస్తాన్‌కు అమెరికా షాకిచ్చింది. హక్కానీ నెట్‌వర్క్‌పై సమర్థవంతంగా పోరాడలేదని ఆరోపిస్తూ సంకీర్ణ సాయం కింద పాక్‌కు అందిస్తున్న 90కోట్ల డాలర్లలో 35కోట్ల డాలర్లకు కోతపెట్టింది. హక్కానీ ఉగ్రవాదులను నిర్మూలించడానికి పాక్ తీసుకున్న చర్యలపై తాను సంతృప్తిగా లేనని అమెరికా రక్షణ కార్యదర్శి జేమ్స్ మాటిస్ కాంగ్రెస్ డిఫెన్స్ కమిటీకి తెలపడంతో పెంటగాన్ ఈ నిర్ణయం తీసుకుంది. అఫ్గానిస్తాన్, పాక్‌ల విషయంలో అమెరికా విదేశాంగ విధానాన్ని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ సమీక్షించనున్న తరుణంలో సాయాన్ని నిలిపివేయడం గమనార్హం