వాషింగ్టన్ : ఉగ్రవాదంపై పోరులో పాకిస్తాన్ పూర్తిగా సహకారం అందించడం లేదంటూ అమెరికా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదాన్ని పెంచుతున్న హక్కానీ నెట్‌వర్క్‌పై పాకిస్తాన్ ఎటువంటి సైనిక చర్య చేపట్టడం లేదని ట్రంప్ ఆడ్మినిస్ట్రేషన్ అసహనం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ తాజాగా తీసుకుంటున్న చర్యలు ఉగ్రవాదానికి కొమ్ముకాస్తున్నట్లు ఉందని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. అందులో భాగంగానే ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్‌ను పాకిస్తాన్ గృహనిర్భంధం నుంచి విడుదల చేసిందని అమెరికా పేర్కొంది.
పాకిస్తాన్ కేంద్రంగా హక్కానీ నెట్‌వర్క్ ఉగ్రకార్యక్రమాలు నిర్వహిస్తోందని.. అయినా పాకిస్తాన్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ట్రంప్ న్యూ సౌత్ ఏషియా స్ట్రాటజీలో పాకిస్తాన్ భాగమైనా అందుకు అనుగుణంగా ఆ దేశం చర్యలు తీసుకునే అవకాశలు లేవని అమెరికా నిఘా సంస్థలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment