పొరపాటున కండోమ్ మింగేసిందట! | Woman complains of stomach ache, doctors find condom inside appendix | Sakshi
Sakshi News home page

పొరపాటున కండోమ్ మింగేసిందట!

Published Fri, May 27 2016 2:27 PM | Last Updated on Mon, Sep 4 2017 1:04 AM

పొరపాటున కండోమ్ మింగేసిందట!

పొరపాటున కండోమ్ మింగేసిందట!

కామెరూన్: కడుపు నొప్పి వస్తుందని ఆసుపత్రికి వచ్చిన ఓ యువతి పొట్టలో కండోమ్‌ను గుర్తించిన డాక్టర్లు కంగుతిన్నారు. కామెరూన్లోని ఓ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో యువతి అపెండిక్స్లో ఉన్న కండోమ్ను తొలగించిన డాక్టర్లు.. ఆమెకు కడుపునొప్పి నుంచి విముక్తి కలిగించారు.

వివరాల్లోకి వెళ్తే.. కడుపునొప్పితో పాటు వికారంగా ఉందని ఇటీవల ఓ 26 ఏళ్ల యువతి కామెరూన్లోని ఓ ఆసుపత్రికి వెళ్లింది. దీంతో ఆమె స్కాన్ రిపోర్టును పరిశీలించిన వైద్యులు.. అమె అపెండిక్స్ ఉబ్బి ఉండటాన్ని గమనించారు. దీంతో వెంటనే ఆపరేషన్ చేసి అపెండిక్స్ను తొలగించే క్రమంలో అక్కడే ఉన్న రబ్బర్ లాంటి ఓ పదార్థాన్ని చూసి వారు షాక్ తిన్నారు. దానిని పరీక్షించి చూసిన డాక్టర్లు చివరికి కండోమ్గా తేల్చారు. కండోమ్ను ఆమె నోటి ద్వారా తీసుకోవటం వల్ల అది అపెండిక్స్ వరకూ వచ్చి అడ్డుపడిందని  వైద్యులు తెలిపారు. వారం రోజుల క్రితం తన బాయ్ ఫ్రెండ్తో కలిసిన సందర్భంలో ప్రమాదవశాత్తూ కండోమ్ను మింగినట్లు ఆ యువతి వెల్లడించడంతో డాక్టర్లకు అసలు విషయం తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement