
ప్రతీకాత్మక చిత్రం
నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా ఓ అమ్మాయి పరిచయం అయ్యింది. తను కూడా మా కాలేజీనే. ఫస్ట్ బుక్స్ కోసం హాయ్‌తో మొదలైన మా మెసేజ్‌లు ఆగలేదు. అలా ఫ్రెండ్స్‌లా చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లం. తనంటే నాకు ఇష్టమో లేక ఆకర్షణో తెలీదు. చదువు ముఖ్యమనే భయంతో లవ్‌కు వాటికి దూరంగా ఉందాం అనుకున్నా. కానీ, ఏమైందో ఏమో ఓ రోజు ఉదయం నాకుగా నేను ఐ లవ్‌యూ అని తనకు మెసేజ్ చేశా. తను సరిగా రెస్పాండ్ అవ్వలేదు. అయితే నేను మా మధ్య స్నేహం ఎక్కడ దెబ్బతింటుందోనని ‘సారీ! జోక్ చేశా’ అని అబద్ధం చెప్పా. అలా కొన్ని రోజుల తర్వాత తను నన్ను ‘నిజంగా జోక్ చేశావా? ’అని అడిగింది. ‘అవును’ అన్నాను.
అప్పుడు తను ‘ నేను మాత్రం దాన్ని సీరియస్‌గా తీసుకున్నా! ఐ లవ్ యూ’ అని చెప్పింది. ఈ సారి నేను సరిగా రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకంటే మాది ఆకర్షణో.. ప్రేమో.. తెలీదు. అలా కొన్ని రోజులు ఎదురుచూసిన తర్వాత అర్థం చేసుకుని లవ్‌ను కన్ఫార్మ్ చేసుకున్నా. ఇప్పుడు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాం. ప్రేమ ఏదైనా ఫ్రెండ్‌షిప్‌తోనే మొదలవుతుంది. కొన్ని రోజుల జర్నీ తర్వాత ఒకరిమీద ఒకరికి ఓ అభిప్రాయం వస్తుంది.
- నాని, తెనాలి
చదవండి : ఆమె ప్రేమ ముందు నేను ఓడిపోయా!
ఆ కుటుంబం నన్ను నాశనం చేసింది