
ప్రతీకాత్మక చిత్రం
మాది ఒంగోలు! ఎంఎస్‌సీ కౌన్సిలింగ్‌కోసం గుంటూరు వచ్చాను. అప్పుడు చూశాను తనని. లవ్ యాట్ ఫస్ట్ సైట్. తనను చూసిన మొదటిసారే నా కోసమే తను పుట్టిందనిపించింది. నన్ను చూసిన కొత్తలో ‘ఎవడు వీడు నన్ను చూస్తున్నాడు’ అని వాళ్ల ఫ్రెండ్స్‌కు చెప్పింది. అలా కౌన్సిలింగ్ అయిపోయే వరకు తను నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంది. నేను కూడా తనని అలా చూస్తూ ఉండిపోయా. సాయంత్రం తను తిరిగి వెళ్లిపోయేటప్పుడు తన ఫ్రెండ్‌ను ఆమె పేరేంటని అడిగాను. అప్పుడామె‘ ఆమె పేరేంటి, ఫోన్ నెంబర్ కూడా చెబుతా’ అని అంది. కొద్దిసేపు ఆలోచించి ఓ నెంబర్ ఇచ్చింది. నా ఏంజిల్ అనుకుని కొన్ని రోజులు మాట్లాడుతూ ఉన్నాను. కానీ, ఓ రోజు నేను చాటింగ్ చేస్తోంది ఏంజిల్‌తో కాదు ఆమె ఫ్రెండ్ లల్లితో అని తెలిసింది.
నాకు చాలా కోపం వచ్చింది. ఓ రోజు నా ఏంజిల్ కాల్ చేసింది కలవాలని. నేను వెంటనే తన కోసం ఐస్ మ్యాజిక్‌కు వెళ్లాను. తను, లల్లి ఇద్దరూ వచ్చారు. ఫస్ట్ సారీ చెప్పి ‘నేనే తనని నీతో మాట్లాడమని చెప్పాను.’ అంది. ‘ఎందుకిలా చేశారు’ అని అడిగితే ‘చూడగానే లవ్ అంటారేంటి? నాకు మా బావ ఉన్నాడు.’ అని చెప్పింది. నేను చాలా బాధపడ్డాను. అప్పుడు ‘కనీసం ఫ్రెండ్‌గానైనా నాతో మాట్లాడండి’ అని అడిగాను. సరే అని చెప్పి‘ సరే అన్నాను కదా అని ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయకండి! కుదిరినపుడు ఈవినింగ్ చేయండి.’ అంది.
సరే అన్నాను. తర్వాత మా ఫ్రెండ్షిప్ ఇద్దరం కలిసి పార్కులకు, సినిమాలకు వెళ్లేదాక కంటిన్యూ అయ్యింది. ఆ రోజు డేర్ చేసి నా లవ్ ప్రపోజ్ చేద్దామని ఫిక్స్ అయ్యా. ఓ రోజు కాలేజ్‌కి లీవ్ పెట్టి నా రూంలో ఆలోచిస్తున్నాను. తనకు ప్రపోజ్ చేయాలని చాలా టెన్షన్! ఒక వేళ ప్రపోజ్ చేస్తే మా స్నేహం దెబ్బతింటుందేమోనన్న భయం. ఫైనల్‌గా డిసైడ్ అయి ప్రపోజ్ చేశా ‘నువ్వంటే నాకు చాలా ఇష్టం’ అని. వెంటనే తను ఫోన్ పెట్టేసింది. నాకు చాలా బాధ వేసింది. ఏమీ అర్థం కాలేదు. కాల్ చేస్తే కట్ చేసింది. ఓ రెండు గంటల తర్వాత నాకు మెసేజ్ వచ్చింది. ‘నువ్వంటే నాకు ఇష్టం’ అని. అప్పుడు అనిపించింది ఏదో గెలిచానని, మనకు ఇక తిరుగులేదనేంత హ్యాపీ. ఆ రోజును నేను ఎప్పటికీ మర్చిపోలేను.
- శాండీ, ఒంగోలు
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment