ఉత్తమ విలన్ మేకప్‌కి ఐదు గంటలు! | 5 hour makeup routine for Kamal Haasan's uthama villain film | Sakshi
Sakshi News home page

ఉత్తమ విలన్ మేకప్‌కి ఐదు గంటలు!

Feb 23 2014 11:19 PM | Updated on Sep 2 2017 4:01 AM

ఉత్తమ విలన్ మేకప్‌కి ఐదు గంటలు!

ఉత్తమ విలన్ మేకప్‌కి ఐదు గంటలు!

పాత్ర కోసం శరీరాన్ని ఎంత కష్టపెట్టడానికైనా వెనకాడరు కమల్‌హాసన్. అందుకు మంచి ఉదాహరణ ‘విచిత్ర సోదరులు’. అందులో ‘అప్పూ’ పాత్ర కోసం కాళ్లు వెనక్కి మడిచి, మోకాళ్లకు బూట్లు

పాత్ర కోసం శరీరాన్ని ఎంత కష్టపెట్టడానికైనా వెనకాడరు కమల్‌హాసన్. అందుకు మంచి ఉదాహరణ ‘విచిత్ర సోదరులు’. అందులో ‘అప్పూ’ పాత్ర కోసం కాళ్లు వెనక్కి మడిచి, మోకాళ్లకు బూట్లు తొడుక్కుని నటించారు కమల్. భారతీయుడు, భామనే సత్యభామనే, దశావతారం.. ఇలా విభిన్న అవతారాల్లో కమల్ కనిపించిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఆ అవతారాలకు సంబంధించిన మేకప్ కోసం ఆయన గంటలు గంటలు వెచ్చించారు. తాజాగా, ‘ఉత్తమ విలన్’ చిత్రంలోని పాత్ర కోసం మేకప్‌కి ఐదు గంటలు కేటాయించనున్నారు కమల్. రమేష్ అరవింద్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బెంగళూరులో ఫొటోషూట్ చేశారు. ఈ చిత్రంలో కమల్ ఓ వెరైటీ లుక్‌లో కనిపిస్తారట. ఈ లుక్‌తోనే ఫొటోషూట్ జరిగిందని సమాచారం. ఈ లుక్ కోసమే కమల్ దాదాపు ఐదు గంటలు మేకప్‌కి కేటాయించారట. రెండు రోజుల పాటు ఈ ఫొటోషూట్ జరిగిందని, గెటప్‌కి సంబంధించి కమల్‌కి గౌతమి కొన్ని టిప్స్ ఇచ్చారని వినికిడి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement