
అల్లు అర్జున్, పవన్ కల్యాణ్(పాత చిత్రం)
పశ్చిమ గోదావరి జిల్లా: తాడేపల్లిగూడెం మండలం మిలిటరీ మాధవరం గ్రామంలో జరిగిన ‘ నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’ ఆడియో ఫంక్షన్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా అల్లు అర్జున్ వ్యాఖ్యలు చేశారు.‘ ఏసీ రూముల్లో సుఖాలను వదులుకుని, కోట్ల రూపాయల కెరీర్ వదులుకొని రాజకీయాలలోకి వచ్చారు. చాలా మంది చాలా మాటలు మాట్లాడుతున్నారు..కానీ చాలా వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నారు. కొంతమంది మాట్లాడారు, మాట్లాడించారు. అందరిదీ తప్పు, మాట్లాడింది లక్షల మందికి చూపించిన వాళ్లది ఇంకా పెద్ద తప్పు.. పవన్ కళ్యాణ్‌ను పర్సనల్‌గా టార్గెట్ చేస్తున్నారు. నాకు నచ్చలేదు. రాజకీయాల్లోకి వచ్చినపుడు విమర్శలు వస్తాయి. ప్రజారాజ్యం సమయంలోనే చిరంజీవిని పలువురు విమర్శలు చేయడం చూసి అలవాటైంది. మెగా కుటుంబమంతా ఒక్కటే’ అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment