
అల్లు అర్జున్
‘అల వైకుంఠపురములో’ సక్సెస్‌తో మంచి జోష్ మీద ఉన్న అల్లు అర్జున్ 40 రోజుల పాటు హైదరాబాద్‌కు దూరం కాబోతున్నారు. హాలిడే ట్రిప్ అనుకునేరు.. కాదు. సుకుమార్‌తో చేస్తున్న సినిమా కోసం కేరళ వెళుతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఓ చిన్న షెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా తర్వాతి షెడ్యూల్‌ను మార్చి మూడో వారం నుండి కేరళలో ప్రారంభించనున్నారు. నలభైరోజులు పాటు నాన్‌స్టాప్‌గా ఈ షెడ్యూల్ జరగ నుంది. షూటింగ్‌కు సంబంధించిన లొకేషన్ల కోసం పలుమార్లు రెక్కీ నిర్వహించారట దర్శకుడు సుకుమార్. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మికా మందన్న నటిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment