త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీకి జోడీగా...
కాంబినేషన్ కొత్తగా ఉంటే... ప్రేక్షకులకు కూడా కొత్తగా ఫీలవుతారు. అందుకే దర్శక, నిర్మాతలు హీరోహీరోయిన్ల విషయంలో ఫ్రెష్‌గా ఆలోచిస్తుంటారు.
కాంబినేషన్ కొత్తగా ఉంటే... ప్రేక్షకులకు కూడా కొత్తగా ఫీలవుతారు. అందుకే దర్శక, నిర్మాతలు హీరోహీరోయిన్ల విషయంలో ఫ్రెష్‌గా ఆలోచిస్తుంటారు. ‘అత్తారింటికి దారేది’ విషయంలో దర్శకుడు త్రివిక్రమ్ అలాగే ఆలోచించి, పవన్‌కల్యాణ్ సరసన సమంత, ప్రణీతలకు చోటిచ్చారు. త్వరలో ఆయన అల్లు అర్జున్‌తో సినిమా చేయబోతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లోనే వచ్చిన ‘జూలాయి’ సినిమాలో బన్నీకి జోడీగా ఇలియానాను ఉంచి ప్రేక్షకులకు ఓ కొత్త ఫీల్‌ని అందించారు త్రివిక్రమ్. ఇప్పుడు కూడా అలాంటి ఫీల్‌నే కలిగించాలనే ఉద్దేశంతో అల్లు అర్జున్ సరసన కథానాయికగా సమంతను తీసుకున్నారు.
బన్నీ, సమంత కలిసి పనిచేయడం ఇదే తొలిసారి కూడా. బన్నీ అంటే యూత్ ఐకాన్. యువతరం ప్రేక్షకులు ఆయన సినిమాలు చూడటానికి అమితంగా ఇష్టపడుతుంటారు. ఇక త్రివిక్రమ్ మార్క్ వినోదానికి అందరూ అభిమానులే. ప్రస్తుతం కథానాయికల్లో సమంత నంబర్‌వన్. ఇప్పుడు ఆమె హవా నడుస్తోంది. ఈ ముగ్గురూ కలిసి పనిచేసే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం త్రివిక్రమ్ కథ తయారీలో ఉన్నారు. త్వరలోనే సినిమా సెట్స్‌కెళ్లనుంది.