
యాంకర్ అనసూయ
ప్రముఖ యాంకర్ అనసూయ సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పేసింది. మంగళవారం ఓ మహిళ, అనసూయ తమ ఫోన్ పగలగొట్టిందంటూ ఫిర్యాదు చేయటంలో సోషల్ మీడియాలో అనసూయపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. జరిగిన సంఘటన విషయంలో క్లారిటీ ఇచ్చేందుకు అనసూయ ప్రయత్నించినా.. నెటిజెన్లు శాంతించలేదు. దీంతో మనస్థాపం చెందిన అనసూయ తన సోషల్ మీడియా అంకౌట్లు డిలీట్ చేసింది. ట్వీటర్‌తో పాటు ఫేస్ బుక్‌లో కూడా అనసూయ అకౌంట్ కనిపించటం లేదు. నెటిజెన్ల నుంచి విమర్శలు రావటం వల్లే అనసూయ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
బుల్లితెరపై టీవీ షోలతో బిజీగా ఉన్న అనసూయ వెండితెర మీద కూడా సందడి చేస్తోంది. ఇప్పటికే పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ భామ ప్రస్తుతం రామ్ చరణ్ రంగస్థలం, మోహణ్ బాబు గాయత్రి సినిమాలతో పాటు శ్రీనివాస్ రెడ్డి హీరోగా తెరకెక్కుతున్న సచ్చిందిరా గొర్రె సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది.