చెన్నైలో వందేళ్ల సినిమా వేడుకలకు రంగం సిద్ధం
Published Wed, Sep 18 2013 1:15 AM | Last Updated on Thu, May 24 2018 12:20 PM
భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్యమండలి చెన్నైలో భారీ ఎత్తున వేడుకలు నిర్వహిస్తోంది. ఈ నెల 21 నుంచి 24 వరకూ ఈ వేడుకలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి.
21న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆధ్వర్యంలో తమిళ సినిమా వేడుకలు ప్రారంభమవుతాయి. 22న ఉదయం కన్నడ చిత్రసీమ, సాయంత్రం తెలుగు సినిమా పరిశ్రమ వేడుకలు జరుగనున్నాయి.
23న ఉదయం మలయాళ చిత్రసీమ వేడుకలు, సాయంత్రం డా.అక్కినేని నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు జరుగుతాయి. 24న జరిగే ముగింపు వేడుకలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్నారని దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు సి. కల్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు.
Advertisement
Advertisement