లవ్లో పడిపోయా.... | 'Bajrangi...' rekindled Shekhar Kapur's love for Hindi cinema | Sakshi
Sakshi News home page

లవ్లో పడిపోయా....

Jul 25 2015 3:53 PM | Updated on Sep 3 2017 6:09 AM

లవ్లో పడిపోయా....

లవ్లో పడిపోయా....

బజరంగీ భాయిజాన్ సినిమా చూసి బాలీవుడ్ సినిమాతో లవ్లో పడిపోయానని ప్రఖ్యాత దర్శకుడు శేఖర్ కపూర్ ప్రశంసలు కురిపించారు.

ముంబై: బజరంగీ భాయిజాన్ సినిమా చూసి బాలీవుడ్ సినిమాతో లవ్లో పడిపోయానని ప్రఖ్యాత దర్శకుడు శేఖర్ కపూర్ ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ నటించిన బజరంగీ భాయిజాన్ సినిమాను చూసిన ఆయన  తన సంతోషాన్ని ట్విట్టర్ లో పంచుకున్నారు.  సినిమా చాలా బావుందని,   ఈ సినిమా చూశాక, హిందీ సినిమాపై  ప్రేమ, అభిమానం కలిగాయని కామెంట్ చేశారు.  ఈ సందర్భంగా సినిమా దర్శకుడు కబీర్ ఖాన్, హీరో సల్మాన్ ఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీలకు తన అభినందనలు తెలిపారు. లెసన్స్ ఆఫ్  లవ్ పేరుతో సోషల్ మీడియాలో తన భావాలను పంచుకోవడం, ట్విట్టర్ లో తరచూ కమెంట్లు  షేర్ చేయడం ఈ దర్శకుడికి అలవాటు.
 

అయితే విభిన్న కథాంశాలతో రూపొందించిన మాసూమ్, మిస్టర్ ఇండియా, బండిట్ క్వీన్, ఎలిజబెత్ సినిమాలతో  ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు శేఖర్ కపూర్. ఇపుడు ఈ విశ్వదర్శకుడి ప్రశంసలతో బజరంగీ భాయిజాన్ ప్రతిష్ట మరింత పెరిగినట్టయింది.

కాగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో సల్మాన్, కరీనా జంటగా రూపొందిన  బజరంగీ  భాయిజాన్ చిత్రం రికార్డుల సునామీ సృష్టిస్తోంది.  ఒక బిజినెస్ పరంగానే కాకుండా,  అనేక కోణాల్లో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటోంది.  ముఖ్యంగా  బాలనటి హర్షాలీ మంచి మార్కులు కొట్టేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement