భరత్‌ విజన్‌.. సరికొత్త రికార్డు | Bharat Ane Nenu Most Liked Teaser Till Now | Sakshi
Sakshi News home page

Mar 16 2018 9:16 AM | Updated on Mar 16 2018 2:00 PM

Bharat Ane Nenu Most Liked Teaser Till Now - Sakshi

సాక్షి, సినిమా : సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు అప్‌ కమింగ్‌ మూవీ భరత్‌ అనే నేను విడుదల ముందే ఓ ఘనత సొంతం చేసుకుంది. టాలీవుడ్‌లో ఇప్పటిదాకా అత్యధిక లైక్‌లు సాధించిన టీజర్‌గా రికార్డు సొంతం చేసుకుంది. 

అంతకు ముందు ఈ రికార్డు పవన్‌ కళ్యాణ్‌ అజ్ఞాతవాసి పేరిట ఉండేది. మార్చి 6న విజన్‌ ఆఫ్‌ భరత్‌ పేరిట టీజర్‌ను విడుదల చేయగా.. ఇప్పటిదాకా కోటి 32లక్షలకు పైగా వ్యూవ్స్‌.. 5.26 లక్షలకు పైగా లైక్‌లు సంపాదించుకుని యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. సందేశాత్మకంతోపాటు స్టైలిష్‌గా ఉన్న టీజర్‌ ప్రేక్షకులను అలరించిందనే చెప్పుకోవాలి.

కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మహేష్‌ సీఎం పాత్రలో కనిపించబోతున్నాడు. సమకాలీన రాజకీయాలతో తెరకెక్కిన భరత్‌ అనే నేను ఏప్రిల్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement