
బాలీవుడ్ సెలబ్రిటీలు లగ్జరీ కార్లపై ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ఇప్పటికే పలు బెంజ్ కార్లను కలిగి ఉన్న కంగనా రనౌత్ .. తాజాగా మెర్సిడెజ్ బెంజ్‌కు చెందిన స్పోర్ట్స్ యుటిలీటీ వెహికల్‌ని కొనుగోలు చేశారు. అధునాతన ఫీచర్లు గల ఈ కారు పక్కన నుంచుని ఆమె ట్వీట్ చేశారు. మనాలీలో ఈ ‘క్వీన్’ ఇటీవల ఇల్లు కట్టుకున్న సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్‌లలో ఎప్పుడూ బిజీగా ఉండే ఈ అమ్మడికి షాపింగ్ చేసే తీరికే ఉండదట. దాంతో ఆమె చెల్లెలు రంగోలి, మేనేజర్ రూ.61.75 లక్షల ఈ ఎస్‌యూవీని గిఫ్టుగా కొనిచ్చారట. ఈ విషయాన్ని రంగోలీ ట్విటర్‌లో తెలిపారు.
బేస్ 250 డి మోడల్‌కు చెందిన ఈ బెంజ్ కార్లు.. బాలీవుడ్ ప్రముఖ నటీనటులు హ్యుమా ఖురేషీ, సల్మాన్ ఖాన్, షాహిద్ కపూర్ వద్ద ఉన్నాయి. ఇక కంగనా నటించిన 'జడ్జిమెంటల్ హై క్యా' విడుదలై సినీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. కంగానా వద్ద బీఎండబ్ల్యూ-7 సిరీస్ సెడాన్ కారు కూడా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment