చిరుతో చిందేయనున్న ఎమ్మెల్యే | Catherin Theresa special song in chiru 150 | Sakshi
Sakshi News home page

చిరుతో చిందేయనున్న ఎమ్మెల్యే

Published Sat, May 21 2016 10:19 AM | Last Updated on Mon, Sep 4 2017 12:37 AM

చిరుతో చిందేయనున్న ఎమ్మెల్యే

చిరుతో చిందేయనున్న ఎమ్మెల్యే

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఎనౌన్స్ చేసిన దగ్గరనుంచి రోజుకో వార్త టాలీవుడ్ సర్కిల్స్లో సందడి చేస్తోంది. ఈ సినిమాకు పనిచేయబోయే సాంకేతిక నిపుణుల నుంచి నటీనటుల వరకు రకరకాల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. ఇప్పటికీ హీరోయిన్ల విషయంలో క్లారిటీ రాకపోయినా ఇద్దరు సీనియర్ హీరోయిన్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వరుసగా సీనియర్ హీరోలతో జతకడుతున్న నయనతార దాదాపు కన్ఫామ్ అని భావించారు. అయితే ఇప్పుడు కొత్తగా అనుష్క పేరు తెర మీదకు వచ్చింది.

ఇంకా హీరోయిన్ పేరు ఫైనల్ కాకముందే స్పెషల్ సాంగ్లో ఆడిపాడేందుకు ఓ కుర్ర హీరోయిన్ను ఫైనల్ చేశారట. ఈ మధ్యే సరైనోడు సినిమాలో మెగా హీరో అల్లు అర్జున్ సరసన గ్లామరస్ ఎమ్మెల్యేగా నటించిన కేథరిన్ థెరిస్సా, మెగాస్టార్ 150వ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనుందట. అంతేకాదు కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా ఈ అమ్మడు కనిపించనుందన్న టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్లో బిజీగానే ఉన్నా తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న కేథరిన్కు ఇది గోల్డెన్ ఛాన్స్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement