
కండిషన్స్ అప్లై
తెలుగు, తమిళ్, హిందీ.. ఆ మాటకు వస్తే ఇండియన్ సినిమాల్లో ఎక్కువ శాతం హీరోయిన్లకు చాయిస్ ఉండదు. వాళ్లకు కథలు ఎంపిక చేసుకునే చాయిస్ చాలా తక్కువ. ఢిల్లీ బేబీ తాప్సీ మాత్రం చాయిస్ నాదే అంటున్నారు. దర్శక-నిర్మాతలకు కండీషన్స్ పెడుతున్నారు. జనరల్‌గా ఏ హీరోయిన్ అయినా స్టార్ హీరో.. పేరున్న దర్శకుడు.. మంచి రెమ్యునరేషన్.. చూసుకుని సినిమాలు చేస్తుంటారు. కెరీర్ ప్రారంభంలో తాప్సీ కూడా అలాంటి సినిమాలు చేశారు.
ఇప్పుడు మాత్రం ససేమిరా అంటున్నారు. కథ, అందులో పాత్ర నాకు నచ్చాలని కండీషన్స్ చిట్టా విప్పుతున్నారు. ‘‘తెలుగులో నేనిప్పుడు ‘ఘాజీ’ సినిమాలో మాత్రమే నటిస్తున్నాను. హీరో రానా దగ్గుబాటి, నేనూ గర్వించే సినిమా అవుతుంది ఇది. ‘ఘాజీ’ తర్వాత హీరోతో రొమాన్స్, పాటల కోసమే హీరోయిన్ అన్నట్టుండే సినిమాలు, హీరోయిన్‌కి విలువ ఇవ్వని సినిమాలు చేయను.