ది కూల్‌ మామ్‌ శ్రీదేవి చివరి యాడ్‌ ఇదే? | Cool Mom Sridevi is the end of the ad? | Sakshi
Sakshi News home page

ది కూల్‌ మామ్‌ శ్రీదేవి చివరి యాడ్‌ ఇదే?

Published Wed, Feb 28 2018 12:33 AM | Last Updated on Wed, Feb 28 2018 12:33 AM

Cool Mom Sridevi is the end of the ad? - Sakshi

∙‘ది కూల్‌ మామ్‌’ యాడ్‌లో శ్రీదేవి 

‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’ తర్వాత శ్రీదేవి నటించిన ‘మామ్‌’ కూడా సూపర్‌ హిట్‌ అయిన విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విశేషం ఏంటంటే.. శ్రీదేవి ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ చేసిన లాస్ట్‌ మూవీ ‘మామ్‌’ అయితే.. చివరి యాడ్‌ కూడా ‘మామ్‌’ పేరుతోనే ఉంది. సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసిన దానిని బట్టి, శ్రీదేవి నటించిన లాస్ట్‌ యాడ్‌ ‘ది కూల్‌ మామ్‌’. 2 నిమిషాల 30 సెకన్లు నిడివిగల ఈ యాడ్‌లోని కొంత భాగం ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. ఇది  చిన్నారులను ఉత్తేజపరిచే యాడ్‌. ఓ ఫుడ్‌కి సంబంధించిన ఈ యాడ్‌లో ‘‘ఇల్లైనా, స్కూలైనా ఓపెన్‌గా ఉండండి. ఎమోషనల్‌ డ్రామాను నేను యాక్సెప్ట్‌ చేయను. ఎందుకంటే మీ అమ్మ మీకు స్నేహితురాలు అండ్‌ సూపర్‌ కూల్‌’’ అంటూ శ్రీదేవి సందడి చేశారు.

ఇందులో జగదేక సుందరి మామ్‌గా చాలా అందంగా కనిపించారు. మొత్తం నాలుగు గెటప్స్‌లో కనిపించి, ఆకట్టుకున్నారు. ఈ యాడ్‌లో శ్రీదేవి హావభావాలు సూపర్‌గా ఉన్నాయి. అతిలోక సుందరి ఆకస్మిక మరణం పొంది ఉండకపోతే ఇలాంటి మరెన్నో యాడ్స్‌లోనూ, సినిమాల్లోనూ చూసి ఉండేవాళ్లం. అన్నట్లు.. ఇది చివరి యాడ్‌ అని సర్క్యులేట్‌ చేశారు. అది ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది. ఆ సంగతలా ఉంచితే.. నిజజీవితంలో శ్రీదేవి కూల్‌ మామ్‌. ఈ యాడ్‌లోనూ అలానే కనిపించారు. కచ్చితంగా జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌ ఓ మంచి మామ్‌ని మిస్సయ్యారు. అండ్‌.. మనం కూడా మంచి నటిని మిస్సయ్యాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement