చిన్ననాటి ఫోటో.. మీసంతో దీపికా | Deepika Padukone New Year Wish Comes With A Throwback Pic | Sakshi
Sakshi News home page

చిన్ననాటి ఫోటో.. మీసంతో దీపికా

Jan 1 2020 8:14 PM | Updated on Jan 1 2020 8:56 PM

Deepika Padukone New Year Wish Comes With A Throwback Pic - Sakshi

ముంబై : ఛపాక్‌ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్నారు బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనే. తాజాగా తన అభిమానులందరికీ దీపికా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అందులో ఏముంది అందరూ చెప్తారు కదా అనుకుంటున్నారా. కాకపోతే దీపికా కాస్తా భిన్నంగాతన చిన్ననాటి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ విషెస్‌ చెప్పారు. ‘ప్రతి  ఆలోచనలో, పనిలో స్పష్టత కలిగి ఉండాలి. హ్యాపీ 2020’ అనే క్యాప్షన్‌ను జోడించారు. ఈ ఫోటోను చూస్తుంటే దీపికా చదువుకునే రోజుల్లో స్కూల్‌ ఫ్యాన్సీ డ్రెస్‌ పోటీల్లో ఒకటిగా తెలుస్తోంది. ఇందులో దీపికా మీసంతో..  తెలుపురంగు చీరలో కనిపిస్తోంది. ఇక  దీపికా తన చిన్నప్పటి ఫోటోలను షేర్‌ చేయడం ఇది తొలిసారి కాదు. ఇంతక ముందు కూడా తన చైల్డ్‌ హుడ్‌కు సంబంధించిన అనేక ఫోటోలను పంచుకున్నారు. తన స్నేహితులు దివ్య నారాయణ్‌, స్నేహ రామచంద్రన్‌తో దిగిన ఫోటోలను షేర్‌ చేశారు. ఇక 2018లో విడుదలైన పద్మావత్‌ చిత్రంలో చివరిగా నటించారు దీపికా. తాజాగా మేఘనా గుల్జార్‌ దర్శకత్వంలో రూపోందుతున్న ‘ఛపాక్‌’ మూవీలో నటించగా ఈ సినిమా ఈనెల 10న విడుదల కానుంది. 

post diwali celebrations...💤 #diwali

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement