
సెల్వరాఘవన్– ధనుష్ కాంబినేషన్‌కు తమిళంలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ అన్నదమ్ములిద్దరూ తమ కాంబినేషన్ కుదిరిన ప్రతిసారీ ఓ డిఫరెంట్ సినిమాను ప్రేక్షకులకు అందించారు. ‘కాదల్ కొండేన్ (తెలుగులో ‘అల్లరి’ నరేశ్ చేసిన ‘నేను’), పుదుపేటై్ట, మయక్కం ఎన్న’ సినిమాలు వీరి కాంబినేషన్‌లో వచ్చి, పెద్ద హిట్స్‌గా నిలిచాయి. ఇప్పుడు వీరిద్దరూ నాలుగోసారి సినిమా చేయనున్నారు. ప్రస్తుతం ధను ష్ ‘అసురన్’ అనే సినిమా, దురై సెంధిల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాల తర్వాత అన్న సెల్వరాఘవన్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తారు. ఈ మూడు సినిమాలనూ కలైపులి యస్.థాను నిర్మిస్తుండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment