
స్టార్ హీరో ధనుష్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. పేరుకే తమిళ నటుడు కానీ తెలుగు, హిందీలోనూ బోలెడంత క్రేజ్ సంపాదించాడు. ధనుష్‌లో గాయకుడు, లిరిక్ రైటర్, దర్శకుడు కూడా ఉన్నాడు. నటుడిగా కోలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి చేరిన ధనుష్ ఎదుగుదలలో ఆయన సోదరుడు, దర్శకుడు సెల్వరాఘవన్ పాత్ర ఎంతో ఉంది. తాజాగా అన్న సెల్వ రాఘవన్ గురించి ధనుష్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు.
(ఇదీ చదవండి: ప్రముఖ నిర్మాతకి బ్రేకప్ చెప్పిన భార్య.. విడాకుల తీసుకోబోతున్నారా?)
ధనుష్ తొలి చిత్రం 'తళ్లువదో ఇళమై' సినిమాని తీసిన సెల్వరాఘవన్‌నే. ఈ చిత్రం విజయం వీరిద్దరి ఫేట్ మార్చేసింది. ఆ తర్వాత కాదల్ కొండేన్, పుదుపేట్టై వంటి హిట్ చిత్రాలు వీరి కాంబినేషన్లో వచ్చాయి. కాగా ధనుష్ తన 50వ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తీస్తున్నాడు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం.. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. దీనికి 'రాయన్' టైటిల్ ఫిక్స్ చేశారు.
ఈ సినిమాలో నటీనటులను పరిచయం చేస్తూ ఒక్కో పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు. ఇందులో ధనుష్ అన్న సెల్వరాఘవన్ కూడా క్రేజీ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో వెల్లడించిన ధనుష్.. 'మిమ్మల్ని(సెల్వరాఘవన్ ) డైరెక్ట్ చేస్తానని ఊహించలేదు సర్' అని ఎమోషనల్ అయిపోయాడు. దీనికి బదులిచ్చిన సెల్వరాఘవన్.. తనకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు దర్శకుడు సార్, మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సంభాషణ వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: నన్ను చూసి అబ్బాయిలు కన్నుకొడుతూనే ఉంటారు: నరేశ్)
Never thought I’ll direct you someday sir 🙏🙏 @selvaraghavan pic.twitter.com/X1TnkaGqAR
— Dhanush (@dhanushkraja) February 22, 2024