గుంటూరు: టాలీవుడ్ దర్శకుడు బోయపాటి శ్రీను నివాసంలో విషాదం నెలకొంది. ఆయన తల్లి సీతారావమ్మ(80) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె... గుంటూరు జిల్లాలోని పెదకాకానిలో మరణించారు. కాగా శనివారం సీతారావమ్మ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఇక మాస్ మహారాజ్ రవితేజ.. ‘భద్ర’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన బోయపాటి శ్రీను అనతికాలంలోనే మాస్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తులసి, సింహ, దమ్ము, లెజెండ్ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన.. గతేడాది వినయ విధేయ రామ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. కాగా ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌తో బోయపాటి బిజీగా ఉన్నాడు. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment