
భర్త ఆదర్శ్‌తో భానుప్రియ ( ఫైల్ ఫోటో)
ప్రముఖ నటి భానుప్రియ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె మాజీ భర్త ఆదర్శ్ కౌశల్ అమెరికాలో గుండెపోటుతో మరణించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరణవార్త తెలిసిన వెంటనే భానుప్రియ అమెరికాకు బయలుదేరినట్టు తెలుస్తోంది. తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న భానుప్రియ 1998లో ఆదర్శ్‌ను వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం దంపతులు అమెరికాలో స్థిరపడ్డారు. ఈ జంటకు అభినయ అనే కుమార్తె ఉంది.
అయితే మనస్పర్థల కారణంగా 2005లో భర్తతో విడాకులు తీసుకున్న భానుప్రియ తిరిగి ఇండియాకు వచ్చేశారు. ప్రస్తుతం కుమార్తెతో పాటు ఆమె చెన్నైలో నివాసం ఉంటున్నారు. కొంత విరామం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆమె సపోర్టింగ్ రోల్స్‌లో కనిపిస్తున్నారు. దాంతో పాటు కూచిపూడి, భరతనాట్యం లలో చాలామందికి భానుప్రియ శిక్షణ ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment