![George Reddy Life An Inspiration To Youth - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/22/george.jpg.webp?itok=nvSaOjK9)
జార్జిరెడ్డి సమాధి వద్ద నివాళులర్పిస్తున్న చిత్ర యూనిట్
సాక్షి, కాచిగూడ: చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్న జార్జిరెడ్డి జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ‘జార్జిరెడ్డి’ చిత్ర దర్శకుడు జీవన్‌రెడ్డి అన్నారు. సినిమా విడుదల సందర్భంగా గురువారం నారాయణగూడలోని క్రైస్తవ స్మశానవాటికలో జార్జిరెడ్డి సమాధి వద్ద చిత్ర యూనిట్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దర్శకుడు జీవన్‌రెడ్డి, నిర్మాతలు దామోదర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, హీరో సందీప్ మాధవ్ మాట్లాడుతూ నీతి, నిజాయితీ గల జార్జిరెడ్డి రేపు మళ్లీ పుట్టబోతున్నాడని, ఆయన జీవితం అందరికి ఆదర్శప్రాయంగా ఉంటుందన్నారు.
జార్జిరెడ్డి చిత్రం విడుదల తర్వాతే ఎవరికైనా తాను సమాధానం చెబుతానని దర్శకుడు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మించలేదని, ఆయన నీతి, నిజాయితీ, నాయకత్వ లక్షణాలు తను ఎంతో ఆకట్టుకున్నాయని, రెండేళ్ల పాటు జార్జిరెడ్డి జీవితాన్ని అధ్యయనం చేశాక సినిమాగా రూపొందించామన్నారు. 25 ఏళ్లకే ఓ విద్యార్థి నాయకుడిగా ఎదిగి నాటికి, నేటికి యువతకు స్ఫూర్తిగా నిలిచాడని సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సినిమాపై ఎలాంటి ఆపోహలు వద్దని, ఎవరికైనా అభ్యంతరముంటే వారితో కలిసి తాము సినిమాను చూస్తామని, వారికి సమాధానం చెబుతామని జీవన్‌రెడ్డి అన్నారు. జార్జిరెడ్డి జీవితకథ మాత్రమే చిత్రంలో చూపిస్తున్నామన్నారు. సమాజం జార్జిరెడ్డి లాంటి వాళ్లను చాలామందిని కోల్పోయిందని, ఎలా కోల్పోయామో తెలిపేందుకు సినిమా తీశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment