
పిల్లల పెంపకం సరిగ్గా లేకుంటే?
‘తల్లిదండ్రులు పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే పిల్లల భవిష్యత్ దెబ్బతినడంతో పాటు దేశమే నాశనం అయిపోతుంది’ అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘గీతాపురి కాలనీ’. ఘరలకంఠ మద్దేటి శ్రీనివాస్ దర్శకత్వంలో జి.ఆర్కే ఫిలింస్ సమర్పణలో డికొండ దుష్యంత్ కుమార్, జి.రామకృష్ణ నిర్మించారు. రామ్‌చరణ్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘నేను దర్శకత్వ శాఖలో ఎవరి దగ్గరా పని చేయలేదు.
అయినా.. నాపై, నా కథ మీద నమ్మకంతో దుష్యంత్‌గారు ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చారు. గీతాపురి కాలనీలో జరిగే ఐదు కథల సమాహారమే ఈ చిత్రం. ఐదుగురి పిల్లల్లో రాంకీగారి అబ్బాయి కూడా ఒక కీలక పాత్రలో నటించాడు’’ అన్నారు. ‘బందూక్’ చిత్రంలో తొలిసారిగా నటించా. నటనలో మా నాన్నగారే ఇన్‌స్పిరేషన్. మా అమ్మగారి సహకారంతో ‘గీతాపురి కాలనీ’ చిత్రం తీశా. రాంకీ గారు అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు’’ అని దుష్యంత్ కుమార్ చెప్పారు.