టింగ్... టింగ్... ఎగ్జైటింగ్! | Hassan chord, Sabhash Naidu, Kamal Haasan Real Life Characters | Sakshi
Sakshi News home page

టింగ్... టింగ్... ఎగ్జైటింగ్!

Published Wed, Jun 1 2016 1:35 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM

టింగ్... టింగ్... ఎగ్జైటింగ్!

టింగ్... టింగ్... ఎగ్జైటింగ్!

ఇప్పటివరకూ కథానాయికగా శ్రుతీహాసన్ దగ్గర దగ్గర పాతిక సినిమాలు చేశారు. అవన్నీ ఒక ఎత్తై ఇప్పుడు చేస్తున్న ‘శభాష్ నాయుడు’ మరో ఎత్తు అనేంతగా ఆమె ఆనందపడి పోతున్నారు. దానికి కారణం తొలిసారి తండ్రి కమల్‌హాసన్‌తో కలిసి ఆమె నటిస్తున్న చిత్రం ఇది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో కమల్-శ్రుతి తమ రియల్ లైఫ్ పాత్రలు పోషిస్తున్నారు. అంటే.. తండ్రీకూతుళ్లుగా నటిస్తున్నారు. ‘దశావతారం’లో ఓ పాత్ర అయిన బలరామ్ నాయుడి పాత్రతో ఈ చిత్రం సాగుతుంది. టైటిల్ రోల్‌ను కమల్ చేస్తుండగా, బలరామ్ నాయుడి అసిస్టెంట్ పాత్రను బ్రహ్మానందం చేస్తున్నారు.

ఇందులో కమల్ భార్య పాత్రను రమ్యకృష్ణ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన భారీ షెడ్యూల్‌ను యూఎస్‌లో ప్లాన్ చేశారు. ఈ షూటింగ్‌లో పాల్గొనడానికి శ్రుతి అక్కడకు వెళ్లారు. ‘‘మా నాన్నగారితో యాక్ట్ చేయబోతున్నందుకు చాలా ఆనందంగా, ఎగ్జైటింగ్‌గా ఉంది’’ అని శ్రుతి పేర్కొన్నారు. ఈ బ్యూటీ ఎగ్జైట్ అవుతున్న తీరు చూస్తుంటే... ‘సుప్రీమ్’ చిత్రంలో ‘జింగ్... జింగ్.. అమేజింగ్’ అనే డైలాగ్‌ని కాస్త మార్చి ‘టింగ్... టింగ్.. ఎగ్జయిటింగ్’ అనాలేమో.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement