
లాక్‌డౌన్ కొనసాగుతున్నవేళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటూ తమ వృత్తిగత, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ అలరిస్తున్నారు. తాజాగా హీరోయిన్ అంజలి తాను నటించిన ఓ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘నిశ్శబ్దం సినిమా చిత్రీకరణలో భాగంగా చివరిరోజు తీసుకున్న ఫోటో ఇది’ అని ఆమె కామెంట్ జత చేశారు. ఈ ఫోటోలో.. ప్రధాన పాత్రలో నటించిన అనుష్క ముఖానికి, మరో నటుడు సుబ్బరాజు ముఖానికి రక్తం మరకలు ఉండటం గమనించవచ్చు. ఈ ఫోటోను చూస్తే చివరిరోజు ఏదో యాక్షన్ సన్నివేశాన్ని తీసినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీలో అంజలి శక్తివంతమైన పోలీసాఫీసర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. (కాబోయే భార్య అలా ఉండాలి : విజయ్)
‘నిశ్శబ్దం’ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. కోన వెంకట్ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. అనుష్కతో పాటు మాధవన్, అంజలి, షాలినీ పాండే కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్‌కు మంచి టాక్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా కథ అమెరికాలోని సియోటల్ బ్యాక్ డ్రాప్‌లో సాగుతుంది. ఇక ఇందులో అనుష్క మూగ చిత్రకారిణి సాక్షి పాత్రలో నటించారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందింన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదల కావాల్సింది. కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా ‘నిశ్శబ్దం’ వాయిదా పడింది. పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా నటించిన అంజలి నటనను థియేటర్‌లో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. (పుష్పాభివందనం చేయటం అభినందనీయం : చిరు)