హమ్ తుమ్.. ఏక్ కమ్‌రే మే బంద్ హో! | Hum Tum Ek kamre May bandh ho | Sakshi
Sakshi News home page

హమ్ తుమ్.. ఏక్ కమ్‌రే మే బంద్ హో!

Jun 12 2015 11:48 PM | Updated on Sep 3 2017 3:38 AM

హమ్ తుమ్.. ఏక్ కమ్‌రే మే బంద్ హో!

హమ్ తుమ్.. ఏక్ కమ్‌రే మే బంద్ హో!

ఆలూ, మగల మధ్య చిన్న చిన్న అలకలు, గొడవలు సహజమే. ఇవన్నీ లేని సంసారం బాగానే ఉన్నా, ఇవన్నీ ఉంటే ఇంకా బాగుంటుంది.

ఆలూ, మగల మధ్య చిన్న చిన్న అలకలు, గొడవలు సహజమే. ఇవన్నీ లేని సంసారం బాగానే ఉన్నా, ఇవన్నీ ఉంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే, గొడవపడిన తర్వాత మళ్లీ మామూలుగా మాట్లాడుకోవడం, అలక తీరిన తర్వాత చెప్పుకునే కబుర్లు చాలా చాలా బాగుంటాయి. ఈ అనుభూతి ఎలా ఉంటుందో భార్యా, భర్తలకు బాగా తెలుస్తుంది.
 
 అర్జున్ కపూర్‌లాంటి పెళ్లి కాని వాళ్లకు ఏం తెలుస్తుంది? పైగా, తనకన్నా సీనియర్ అయిన కరీనా కపూర్‌కి భర్తగా నటించాలంటే? ఇంకేమన్నా ఉందా? సరే.. ఇతగాడి సంగతి పక్కన పెడితే పెళ్లయిన కరీనా కపూర్‌కి కూడా భార్యా  భర్తల మధ్య వచ్చే అలకలు గురించి పెద్దగా తెలియదట. ఎందుకంటే, సైఫ్ అలీఖాన్, ఆమె చాలా కూల్‌గా ఉంటారట.
 
 మరి.. అర్జున్, కరీనా సినిమాలో గొడవపడేట్లు నటించాలంటే కొంత అనుభవం కావాలి కదా? అందుకే చిత్రదర్శకుడు ఆర్. బాల్కీ ఈ ఇద్దర్నీ ఓ గదిలో బంధించేశారు. రోజంతా ఒకే గదిలో బంధీలుగా ఉండి, ఇద్దరూ చిరు కోపాలు, అలకలు ప్రదర్శించుకోవాలన్న మాట. పెద్ద పెద్ద గొడవలు కూడా పడాలి. అప్పుడే షూటింగ్‌లో సరిగ్గా చేయగలుగుతారన్నది బాల్కీ అభిప్రాయం. దాదాపు ఐదు రోజుల పాటు వీళ్లిద్దరూ ఇలా గదిలో బంధీలుగా ఉంటారట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement