నాకా.. పెళ్లా.. అప్పుడేనా? | Iam in no rush to get married: Bipasha Basu | Sakshi
Sakshi News home page

నాకా.. పెళ్లా.. అప్పుడేనా?

Published Thu, Sep 11 2014 2:22 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

నాకా.. పెళ్లా.. అప్పుడేనా? - Sakshi

నాకా.. పెళ్లా.. అప్పుడేనా?

నాకా.. పెళ్లా.. అప్పుడేనా.. అంటూ బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ బిపాసా బసు నవ్వేస్తోంది. బోయ్ ఫ్రెండు హర్మన్ బవేజాతో తనకు నిశ్చితార్థం జరిగిపోయిందంటూ వచ్చిన కథనాలను బిపాసా కొట్టిపారేసింది. ఇప్పుడప్పుడే  తన పెళ్లికి వచ్చిన తొందరేమీ లేదని, ప్రస్తుతం తాను నటన మీదే దృష్టి సారించానని చెబుతోంది.  పెళ్లిని తాను చాలా గౌరవిస్తానని, కానీ దానికి ఇంకా చాలా టైం ఉందని చెప్పింది. తాను చాలా ప్రశాంతంగా ఆ పని చేస్తానంది.

ఇప్పుడు తాను చేయాల్సిన సినిమాలున్నాయని, కేవలం నటనే కాక ఇంకా చాలా ఇతర పనులు కూడా చేయాలని, వాటి గురించి ఇప్పుడు మాత్రం చెప్పలేనని బిపాసా అంటోంది. తాజాగా విడుదలైన 'క్రీచర్ 3డి' సినిమా విజయాన్ని ప్రస్తుతం ఆమె ఆస్వాదిస్తోంది. ఇంతకుముందు ఆమె నటించిన 'ఆత్మ', 'హమ్షకల్స్' చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. ప్రేక్షకులు తనను తల్లిపాత్రలో చూసేందుకు ఇష్టపడలేదని, అందుకే ఆత్మ సినిమా పెద్దగా ఆడలేదని అంటోంది. 35 ఏళ్ల బిపాసా బసు 2001లో 'అజ్నబీ' సినిమాతో తన కెరీర్ ప్రారంభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement