రెస్టారెంట్ అధినేత | Jackie Chan to star in 'The Foreigner' | Sakshi
Sakshi News home page

రెస్టారెంట్ అధినేత

Published Mon, Jun 8 2015 11:50 PM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM

రెస్టారెంట్ అధినేత - Sakshi

రెస్టారెంట్ అధినేత

చైనీస్ యాక్షన్ స్టార్ జాకీ చాన్ త్వరలో ఓ భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నటించనున్నారు. ‘ది ఫారినర్’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రం ‘ది చైనామ్యాన్’ అనే నవల ఆధారంగా తెరకెక్కనుంది. ఇందులో జాకీ చాన్ లండన్‌లోని చైనా టౌన్ అనే రెస్టారెంట్ అధినేతగా నటించనున్నారు. కూతురి మరణానికి కారకులైనవారిని కనిపెట్టే విషయంలో సహాయపడని అధికారులతో విసిగి వేసారే ఈ రెస్టారెంట్ అధినేత చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు.

కుమార్తె మరణానికి కారణం ఓ ఉగ్రవాది గుంపు అని తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అనే కథతో ఈ చిత్రం సాగుతుంది. జాకీ తరహా పోరాటాలతో సాగే ఈ చిత్రానికి ఇంకా దర్శకుడు ఖరారు కాలేదు. ‘ది నోట్‌బుక్, ‘ది అదర్ ఉమన్’ చిత్రాలకు దర్శకత్వం వహించిన నిక్ కస్సావెటిస్ దర్శకత్వం చేయాలని అనుకుంటున్నారట. అక్టోబర్‌లో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement