
కాజల్ ఫుల్ జోష్
కాజల్ అగర్వాల్ ఫుల్ జోష్‌గా ఉన్నారు.
కాజల్ అగర్వాల్ ఫుల్ జోష్‌గా ఉన్నారు. షూటింగ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ జాలీ మూడ్‌లో సెల్ఫీల మీద సెల్ఫీలు దిగారు. వాటిని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు. ఒకటి దర్శకుడు అట్లీతో కాజల్ దిగిన ఫొటో. ‘విత్ మై సూపర్ కూల్ డైరెక్టర్’ అంటూ దర్శకుడితో ఉన్న ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారామె.విజయ్ సరసన కాజల్ కథానాయికగా నటిస్తోన్న తమిళ చిత్రానికి దర్శకుడు అట్లీనే.
ఈయనగారి సినిమాల్లో కథానాయికల పాత్రలకు మంచి ప్రాధాన్యం ఉంటుంది. ఉదాహరణకు ‘రాజా రాణి’లో నయనతార పాత్ర. ఇప్పుడు తాజా సినిమాలో కూడా కాజల్‌ది మంచి పాత్రేనట. బహుశా కాజల్ జోష్‌కి అది కూడా ఓ కారణం అయ్యుండొచ్చు.ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను జూన్ 22న, ఆగస్టులో పాటలను, అక్టోబర్‌లో దీపావళికి చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు అట్లీ ప్రకటించారు. గత ఏడాది అట్లీ, విజయ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘తేరి’ చిత్రం తమిళనాట ఘనవిజయం సాధించింది. దాంతో తాజా సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రవిజయంపై కాజల్ కూడా చాలా నమ్మకంగా ఉన్నారు.