
తమిళనాడు రాజకీయాలు హాట్ హాట్‌గా ఉన్నాయి. ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నవాళ్లు, రావాలనుకున్నవాళ్లు ఎవరి శైలిలో వాళ్లు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. సినిమా రంగం నుంచి రజనీకాంత్, కమల్‌హాసన్ ఈసారి పాలిటిక్స్‌లోకి ఎంటర్ కావడం ఖాయం అన్నట్లుగా అక్కడి పరిస్థితులు మారుతున్నాయి.
ముఖ్యంగా రీసెంట్ టైమ్స్‌లో కమల్ చేసిన కొని కామెంట్స్‌ని బట్టి ఆయన పాలిటిక్స్‌లోకి వచ్చేస్తారనే ఫీలింగ్ చాలామందిలో బలపడింది. త్వరలో పొలిటికల్ పార్టీ పెట్టడానికి మంచి టైమ్ చూస్తున్నారని తమిళనాట ఓ మాట వినిపిస్తోంది. ఆ పార్టీ స్థాపించే ముహూర్తం ఇంకెప్పుడో కాదని, కమల్ పుట్టినరోజు నవంబర్ 7నే అన్న వార్తలు వచ్చాయి.
దీంతో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాల్లో సపోర్టింగ్‌గా పోస్టులు పెట్టడం స్టార్ట్ చేశారు. దీని గురించి కమల్ స్పందించారు. పొలిటికల్ పార్టీ పెట్టడం లేదని తెలిపారు. ‘‘నా బర్త్‌డేకి ప్రతి ఏడాది అభిమానులను కలవడం అనేది కామన్. ఈసారి కూడా అలానే కలవాలనుకుంటున్నాను. పార్టీ అనౌన్స్‌మెంట్ కోసం పెట్టబోతున్న మీటింగ్ కాదిది. ఒకవేళ పార్టీ అనౌన్స్ చేయాలనుకుంటే, ప్రజల సాక్షిగానే చేస్తాను’’ అని కమల్ స్పష్టం చేశారు. సో.. నవంబర్‌లో ఇల్లే ఇల్లే అన్నమాట.. అదేనండీ అనౌన్స్‌మెంట్ లేదన్న మాట!
Comments
Please login to add a commentAdd a comment