తెలుగు సినిమా తర్వాత డైరెక్షన్?
ప్రస్తుతం కంగనా రనౌత్ గురించి రెండు వార్తలు షికారు చేస్తున్నాయి. ఒకటి ఆమె క్రిష్ దర్శకత్వంలో ‘మణికర్ణిక’ అనే సినిమా చేయనున్నారనే వార్త. రాణి లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుందని టాక్. ఈ సినిమా తర్వాత కంగనా డైరెక్షన్ చేయనున్నారన్నది మరో వార్త. ఈ రెండు వార్తల్లో ఎంత నిజం ఉందో రానున్న రోజులు చెప్పేస్తాయ్.
ఇదిలా ఉంటే.. గత బుధవారం కంగనా పుట్టినరోజు. ఈ సందర్భంగా తనకు తానే ఓ గిఫ్ట్ ఇచ్చుకున్నారు. ముంబైలోని ఓ ప్రముఖ ఏరియాలో మూడంతస్తుల బిల్డింగ్ కొన్నారట. దీన్ని పర్సనల్ ఆఫీస్‌లా మార్చాలనుకుంటున్నారని సమాచారం. బిల్డింగ్‌ని సౌకర్యవంతంగా మార్పించాక, తాను దర్శకత్వం వహించనున్న సినిమా కార్యక్రమాలను అక్కడ మొదలుపెట్టాలనుకుంటున్నారని బాలీవుడ్ భోగట్టా.