
సవాళ్లకు సై
కంగనా రనౌత్‌కు 80 ఏళ్లు. ఈ వయసులో సోలో లైఫ్ అంటే సో డిఫికల్ట్. సహాయం చేసేవాళ్లుండాలి. కానీ, కంగనా అందుకు ఇష్టపడదు. స్వయంగా తన పనులు తానే చేసుకుంటుంది. ఆగండాగండి.. కంగనా ఏంటి? 80 ఏళ్ల బామ్మ ఏంటి.. మొన్నీ మధ్యే కదా థర్టీ ఇయర్స్‌లోకి ఎంటరైంది అనుకుంటున్నారా? విషయం ఏంటంటే..
‘తేజు’ అనే సినిమాలో కంగనా 80 ఏళ్ల వృద్ధురాలిగా నటించనున్నారట. 30 ఏళ్ల వయసులో 80 ఏళ్ల బామ్మగా నటించడం అంటే మాటలు కాదు. మేకప్‌వైజ్‌గా కష్టపడాలి. బాడీ లాంగ్వేజ్ కుదరాలి. డైలాగులు కూడా ఆ వయసుకి తగ్గట్టుగా పలకాలి. ఇన్ని సవాళ్లున్నప్పటికీ కంగనా మరో పెద్ద సవాల్‌ని ఎదుర్కోవడానికి రెడీ అయ్యారు. అదేంటంటే.. ఈ సినిమాకి తనే దర్శకత్వం వహించనున్నారు. కథ కూడా తనే రాసుకున్నారు.