బెంగళూరు: కరోనాతో చివరి వరకు పోరాడిన కన్నడ సీనియర్ నటుడు హల్వానా గంగాధరయ్య(70) కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది కావడంతో బెంగళూరులోని బీజీఎస్ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి ప్రాణాలు విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు. స్టేజ్ ఆర్టిస్ట్ నుంచి గొప్ప నటుడిగా పేరు సంపాదించుకున్న గంగాధరయ్య "కర్ణాటక నాటక అకాడమీ" అవార్డు సైతం అందుకున్నారు. సుమారు 120 సినిమాలు, 1500కు పైగా షోల్లో కనిపించారు. నీర్ దోసె, కురిగాలు సర్ కురిగాలు, శబ్దదేవి సినిమాలు ఆయనకు మంచి పేరును సంపాదించి పెట్టాయి. (రోడ్డు ప్రమాదంలో నటి దుర్మరణం)
నా స్నేహితుడి మరణం నన్ను బాధిస్తోందని, దర్శకరచయిత ఎన్ సీతారామ్ ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. "ఆస్తోపలో అతను నటించిన డ్రైవర్ పాత్ర అతడికి పాపులారిటీని తెచ్చిపెట్టడమే కాదు, సినిమా విజయానికి దోహదం చేశాయి. ముక్త ముక్త సీరియల్‌లో ముఖ్యమంత్రి రాజానంద స్వామిగా అతను పోషించిన పాత్ర అందరి మన్ననలను అందుకుంది. నాకు సంబంధించిన 127 స్టేజీ షోలలో పాల్గొనడమే కాక సీరియల్స్‌లో మూడున్నరేళ్లు ఆయన ప్రస్థానం కొనసాగింది. ఆ తర్వాత వ్యవసాయం చేసేందుకే పూర్తి సమయం కేటాయించాడు. ఏడెనిమిది రోజుల క్రితం అతడిని ఆఖరుసారి చూశాను" అని ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు. (స్టార్ కమెడియన్ మృతి)
Comments
Please login to add a commentAdd a comment