ఆసక్తికరంగా ‘గుణ 369’ టీజర్‌ | Karthikeya Guna 369 Movie Teaser Out | Sakshi
Sakshi News home page

ఆసక్తికరంగా ‘గుణ 369’ టీజర్‌

Jun 17 2019 12:21 PM | Updated on Jun 17 2019 12:21 PM

Karthikeya Guna 369 Movie Teaser Out - Sakshi

‘ఆర్‌ఎక్స్‌ 100’ లాంటి బోల్డ్‌ కంటెంట్‌తో సూపర్‌ హిట్‌ కొట్టిన హీరో కార్తికేయ.. తాజాగా హిప్పీ చిత్రంతో పలకరించాడు. అయితే ఈ మూవీ ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. అయినా ఈ హీరో జోరు బాగానే కొనసాగిస్తూ.. తన తదుపరి చిత్రాన్ని లైన్లో పెడుతున్నాడు.

అర్జున్‌ జంధ్యాల డైరెక్షన్‌లో రాబోతోన్న గుణ 369 చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఫస్ట్‌ లుక్‌, పోస్టర్‌తో పాజిటివ్‌ టాక్‌ రాగా.. తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. ‘మనం చేసే తప్పుల వల్ల మన జీవితానికి ఏమైనా పర్లేదు కానీ.. పక్కవారి జీవితానికి ఏం కాకుడదు’., ‘మేం మీలాంటి వారికి భయపడేది మాకు ఏమైనా జరుగుతుందనీ కాదు.. మా అనుకున్నవారికి ఏమైనా అవుతుందని’ అనే డైలాగ్‌లతో సినిమా థీమ్‌ ఏంటో మేకర్స్‌ హింట్‌ ఇచ్చేశారు. స్ప్రింట్‌ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి.. ఈ చిత్రానికి చైతన్య భరద్వాజ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement