
ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవా లారెన్స్ నిర్వహిస్తోన్న ఓ అనాథాశ్రమంలోని 18 మంది చిన్నారులకు, ముగ్గురు సిబ్బందికి ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు ఆ చిన్నారులు, ఆ ముగ్గురు సిబ్బంది కరోనా నుంచి కోలుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు లారెన్స్. ఈ విషయంపై ఆయన స్పందిస్తూ – ‘‘అందరితో ఓ మంచి విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నా ట్రస్ట్‌లో ఉంటున్న చిన్నారులు, ముగ్గురు సిబ్బంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. నా సేవే నా పిల్లలను కాపాడిందని భావిస్తున్నాను. పిల్లల కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. సేవే దైవం’’ అన్నారు లారెన్స్.
Comments
Please login to add a commentAdd a comment