స్టార్ హీరోలు వద్దు | Koratala siva next film not with ntr | Sakshi
Sakshi News home page

స్టార్ హీరోలు వద్దు

Published Sat, Oct 3 2015 12:41 PM | Last Updated on Sun, Sep 3 2017 10:23 AM

స్టార్ హీరోలు వద్దు

స్టార్ హీరోలు వద్దు

శ్రీమంతుడు విజయంతో స్టార్ డైరెక్టర్గా మారిపోయిన కొరటాల శివ, ఈ సినిమా విడుదలై 50 రోజులు దాటుతున్నా ఇంతవరకు తన తదుపరి సినిమా ఏదన్నది ప్రకటించలేదు. శ్రీమంతుడు సినిమ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఎన్టీఆర్తో సినిమా ఉంటుందన్న టాక్ వినిపించినా ఇంతవరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాను దసరా సందర్భంగా లాంఛనంగా ప్రారంభిస్తారని భావించారు. కానీ ఇప్పట్లో ఎన్టీఆర్తో సినిమా చేయటం కొరటాల శివకు ఇష్టం లేదట. వరుసగా ప్రభాస్, మహేష్ లాంటి టాప్ స్టార్స్తో సినిమాలు చేసిన కొరటాల శివ, మూడో సినిమా కూడా స్టార్ హీరోతో చేస్తే అంచనాలను అందుకోలేనేమో అని భయపడుతున్నాడు.

తన నెక్ట్స్ సినిమాను ఎలాంటి ఇమేజ్ లేని ఓ యంగ్ హీరోతో చేసే ఆలోచనలో ఉన్నాడు కొరటాల శివ. అక్కినేని అఖిల్ అయితే స్టార్ ఇమేజ్ ఉన్నా, అంచనాలు భారీగా ఉండవని భావిస్తున్నాడట. అయితే అఖిల్ సినిమా రిలీజ్ అయిన తరువాతే తన నెక్ట్స్ సినిమాపై నిర్ణయం తీసుకోవటం కరెక్ట్ అన్న ఆలోచనలో ఉన్నాడు. అంటే కొరటాల శివ నెక్ట్స్ సినిమా అనౌన్స్మెంట్ కోసం మరో నెల రోజులు పాటు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement