
కోలీవుడ్‌కే ఓటు నటి అనన్య
తనకు మాలీవుడ్ కంటే కోలీవుడే బాగుందంటోంది మలయాళ సంచలన నటి అనన్య. తమిళంలో నాడోడిగళ్ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది ఈ భామ. ఎంగేయుమ్ ఎప్పోదుమ్ తదితర చిత్రాలతో నటిగా తనకంటూ ఒక గుర్తింపు పొందింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను మలయాళ నటినైనా తమిళంలోనే నటించడం సౌలభ్యంగా ఉందని పేర్కొంది.
కోలీవుడ్‌లోనే మంచిపాత్రలు లభిస్తున్నాయని, ఇక్కడ తాను నటించిన చిత్రాలన్నీ విశేష ప్రజాదరణ పొందుతున్నాయని చెప్పింది. చిత్రాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నానని, వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించి నటించేయాలన్న తొందర లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో పులివాల్, కాక్‌టైల్ చిత్రాలు చేస్తున్నట్లు అనన్య తెలిపింది.