'చరణ్కి కుదరలేదు అందుకే చిరు చేశారు' | Manchu Manoj About Chiranjeevi Voice over in Gunturodu | Sakshi
Sakshi News home page

'చరణ్కి కుదరలేదు అందుకే చిరు చేశారు'

Published Sun, Feb 26 2017 1:55 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

'చరణ్కి కుదరలేదు అందుకే చిరు చేశారు' - Sakshi

'చరణ్కి కుదరలేదు అందుకే చిరు చేశారు'

రీ ఎంట్రీలో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు అందరివాడు అనిపించుకునేందుకు తాపత్రేయపడుతున్నారు. అందుకే చిన్నా పెద్దా అన్న తేడాలేకుండా ఎవరు ఏ సినిమా ఫంక్షన్కు ఆహ్వానించినా హాజరువుతున్నారు. అదే సమయంలో మాట సాయం అడిగిన ప్రతీ వారికి గాత్రధానం చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇటీవల ఘాజీ సినిమాకు వాయిస్ అందించిన చిరు.. త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న గుంటూరోడు సినిమాకు కూడా వాయిస్ ఇచ్చారు.

అసలు మెగాస్టార్ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో హీరో మనోజ్ వివరించాడు. ముందుగా వాయిస్ ఓవర్ కోసం రామ్ చరణ్ అయితే కరెక్ట్ అని మనోజ్, చరణ్ను సంప్రదించాడట. చరణ్ కూడా చెప్పేందుకు అంగీకరించినా.. ఇప్పట్లో హైదరాబాద్ వచ్చే అవకాశం లేకపోవటంతో.. వెంటనే మనోజ్, చిరంజీవిని సంప్రదించాడు. వెంటనే ఓకె చెప్పిన చిరు, మనోజ్ కు తెలియకుండానే వాయిస్ ఓవర్ చెప్పేసి ఎలా వచ్చిందో చూడమని మనోజ్ కు ఫోన్ చేసి చెప్పాడు. చిరు చేసిన సాయానికి మనోజ్ తెగ ఆనందపడిపోతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement