సెప్టెంబర్ 8న 'ఒక్కడు మిగిలాడు' | Manchu manoj Okkadu Migiladu release Date | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్ 8న 'ఒక్కడు మిగిలాడు'

Published Sat, Aug 5 2017 3:35 PM | Last Updated on Sun, Sep 17 2017 5:12 PM

సెప్టెంబర్ 8న 'ఒక్కడు మిగిలాడు'

సెప్టెంబర్ 8న 'ఒక్కడు మిగిలాడు'

వైవిధ్యమైన కథలను ఎంచుకోంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్న కథానాయకుడు మంచు మనోజ్. తాజాగా ఎల్.టి.టి.ఈ మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన్ పాత్ర పోషించనున్నాడు. అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ సినిమా సెప్టెంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్ లు మాట్లాడుతూ.. "గతంలో ఎన్నడూ భారతదేశ చలనచిత్ర చరిత్రలో చూడని సరికొత్త కథాంశాన్ని 'ఒక్కడు మిగిలాడు' చిత్రంతో ప్రేక్షకులు చూడనున్నారు. మంచు మనోజ్ యాంగ్రీ యంగ్ మేన్ గా ఆశ్చర్యపరుస్తాడు. ఈ చిత్రం ట్రైలర్, పాటలు త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 1990ల కాలం నాటి శ్రీలంక యుద్ధం నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని తప్పకుండా అలరిస్తుందన్న నమ్మకం ఉంది.

ఇటీవల విడుదల చేసిన మంచు మనోజ్ ఫస్ట్ లుక్ కి విశేషమైన స్పందన వచ్చింది. హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేసిన ఈ చిత్రం సాంకేతికత పరంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం ఖాయం. సినిమా నేపధ్య సంగీతాన్ని ప్రాగ్ లో రికార్డ్ చేయనున్నాం.' అన్నారు. మంచు మనోజ్ తో పాటు ఈసినిమాలో అనీషా ఆంబ్రోస్, మిలింద్ గునాజీ, పోసాని, సుహాసిని, సూర్య, బెనర్జీ, జెన్నిఫర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement