చిన్న పెగ్గుతో ‘దేవదాస్‌’! | Nagarjuna And Nani Devdas Teaser Will Be On 24th August | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 23 2018 4:58 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

Nagarjuna And Nani Devdas Teaser Will Be On 24th August - Sakshi

మల్టిస్టారర్‌ల హవా కొనసాగుతున్న ఈ తరుణంలో టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున, నాచురల్‌ స్టార్‌ నాని కాంబినేషన్‌లో రాబోతోన్న దేవదాస్‌ ప్రత్యేకతను చాటుకుంటోంది. నాటి క్లాసికల్‌ హిట్‌ మూవీ దేవదాస్‌ టైటిల్‌తో రాబోతోన్న ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. 

ఇటీవలె విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. డాన్‌గా దేవ పాత్రలో నాగార్జున, డాక్టర్‌గా దాసు పాత్రలో నాని నటిస్తోన్న విషయం తెలిసిందే. రేపు ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్‌. స్మాల్‌ పెగ్‌ లాంటి టీజర్‌తో రేపు సాయంత్రం ఐదు గంటలకు రానున్నట్లు ప్రకటించారు. రష్మిక మందాన్న, ఆకాంక్ష సింగ్‌లు కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాకు శ్రీరామ్‌ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement