
‘బాహుబలి’తో తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన దర్శకధీరుడు రాజమౌళి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఎన్టీఆర్, రామ్‌చరణ్ వంటి స్టార్ హీరోలతో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ మల్టీస్టారర్ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం దాదాపు 80 శాతంకు పైగా పూర్తయినట్లు సమాచారం. అయితే రాజమౌళి సినిమాల షూటింగ్ వేగంగా పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం ఆలస్యమవుతాయి. తాను అనుకున్న పర్ఫెక్ట్ అవుట్‌పుట్ విషయంలో రాజమౌళి రాజీపడరు. గత సినిమాల విషయాల్లో కూడా ఇది నిజమైంది. అయితే తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ రిలీజ్ డేట్‌కు సంబంధించిన వార్త అభిమానులను గందరగోళానికి గురిచేస్తోంది. సినిమా రిలీజ్ డేట్ మారిందని సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
ముందుగా ఈ సినిమాను జులై 30న విడుదల చేయబోతున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఈ సినిమా అనుకున్న తేదీన వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ సినిమా జులై 30న కాకుండా.. దసరా కానుకగా అక్టోబర్ 2020కు వచ్చే అవకాశం ఉందని టాక్. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లతో భారీ రేంజ్‌లో క్లైమాక్స్ ప్లాన్ చేయడం, షూటింగ్ మధ్యలో హీరోలకు గాయాలై విశ్రాంతి తీసుకోవడం వంటి కారణాలతో పలుమార్లు షూటింగ్‌కు అంతరాయం కలగడమే విడుదల తేదీకి మార్పుకు కారణమని టాక్. అంతేకాకుండా సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ చేసిన ఓ ట్వీట్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ అభిమానులకు మింగుడు పడటంలేదు.
‘ఎక్స్‌క్లూజివ్: విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. దక్షిణాదికి చెందిన బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ దర్వకత్వంలో తెరకెక్కుతున్న సినిమా విడుదల తేదీ మారనుంది. ఈ భారీ చిత్రం అక్టోబర్ 2020లో వచ్చే అవకాశం ఉంది’అంటూ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ ‘కేజీఎఫ్2’గురించి అని కొందరు కొట్టిపారేయగా.. చాలా మంది అతడు ఇచ్చిన అప్‌డేట్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ గురించేనని మెజార్టీ నెటిజన్లు ఫిక్స్ అయ్యారు. ఇక ఈ మధ్య జరిగిన ఓ సినిమా ప్రమోషన్‌లో కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్’ అప్‌డేట్ గురించి చెప్పేందుకు రాజమౌళి నిరాకరించిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, కొమరం భీంగా ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా బాలీవుడ్‌కు చెందిన నటీనటులు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. అలియా భట్, ఒలివియా మోరిస్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. అయితే రిలీజ్ డేట్‌పై రాజమౌళి అండ్ టీం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
#Xclusiv: Guess this one... The big film - being directed by the #Blockbuster director from South India - will have a new release date... According to sources, the biggie will now release in Oct 2020.
— taran adarsh (@taran_adarsh) January 18, 2020
చదవండి:
హీరోయిన్ దొరికింది
బన్ని-సుకుమార్ సినిమా టైటిల్ ఇదేనా?
Comments
Please login to add a commentAdd a comment