స్పెయిన్‌లో...మ్యూజిక్! లండన్‌లో...షూటింగ్! | ntr sukumar film shooting in london | Sakshi
Sakshi News home page

స్పెయిన్‌లో...మ్యూజిక్! లండన్‌లో...షూటింగ్!

Published Wed, Apr 8 2015 11:55 PM | Last Updated on Sun, Sep 3 2017 12:02 AM

స్పెయిన్‌లో...మ్యూజిక్! లండన్‌లో...షూటింగ్!

స్పెయిన్‌లో...మ్యూజిక్! లండన్‌లో...షూటింగ్!

 ఎన్టీఆర్ మాస్ హీరో.. సుకుమార్ స్టయిలిష్ డెరైక్టర్. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చే సినిమా ఎలా ఉంటుంది? ఇప్పుడు అందరి కళ్లూ ఈ సినిమా మీదే ఉన్నాయి. సుకుమార్ చాలా వైవిధ్యభరితమైన కథాంశంతో ఎన్టీఆర్‌ని సరికొత్త లుక్‌లో ఆవిష్కరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధమైంది. మరోపక్క నిర్మాణ పూర్వ  కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 2 నుంచి స్పెయిన్‌లోని బార్సిలోనాలో దేవిశ్రీప్రసాద్ ఆధ్వర్యంలో సంగీత చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో పాటల రచయిత చంద్రబోస్, దర్శకుడు సుకుమార్, నిర్మాత బీవీయస్‌యన్ ప్రసాద్ పాల్గొంటున్నారు. ఎన్టీఆర్ ఇమేజ్‌కి తగ్గట్టుగా సుకుమార్ శైలిలో ఈ చిత్రం ఉంటుందనీ, మే 1న లండన్‌లో చిత్రీకరణ మొదలుపెడతామనీ నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి ‘నాన్నకు... ప్రేమతో’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement