విభిన్నమైన ప్రేమకథ | Prince Love story Movie 'Marala Telupana priya' | Sakshi
Sakshi News home page

విభిన్నమైన ప్రేమకథ

Published Mon, May 16 2016 12:24 AM | Last Updated on Mon, Sep 4 2017 12:10 AM

విభిన్నమైన ప్రేమకథ

విభిన్నమైన ప్రేమకథ

‘నీకు నాకు’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన కథానాయకుడు ప్రిన్స్. ఆ తర్వాత ‘బస్టాప్’, ‘రొమాన్స్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తాజాగా ఆయన నటించిన ‘మరల తెలుపనా ప్రియా’ షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం ద్వారా వాణి యం. కోసరాజు దర్శకురాలిగా, వ్యోమనంది హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత శ్రీనివాస్ ఊడిగ మాట్లాడుతూ- ‘‘భిన్నమైన వ్యక్తిత్వాలు, నేపథ్యాలున్న అమ్మాయి, అబ్బాయి మధ్య సాగే విభిన్న ప్రేమకథా చిత్రమిది.

హైదరాబాద్, హరిద్వార్, రుషికేష్, గోవా, లక్కవరం, రాజమండ్రి, శివపురి తదితర అందమైన లొకేషన్స్‌లో షూటింగ్ జరిపాం. శేఖర్ చంద్ర పాటలు ఈ చిత్రానికి హైలెట్. ఈ చిత్రం విడుదల తర్వాత వాణి.యం. కోసరాజు పెద్ద డెరైక్టర్ల జాబితాలో చేరుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. పూజారామచంద్రన్, సమీర్, రవివర్మ, సౌమ్య, కల్పలత, పావనీరెడ్డి తదితరులు నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement